schedule Tuesday, July 07, 2026

వాసవీ మాత వైభోగం..!

calendar_today August 23, 2024
person dharshininews
వాసవీ మాత వైభోగం..!
వాసవీ మాత వైభోగం..! - ఘనంగా అమ్మవారికి కుంకుమార్చన - మల్లేపూలతో అభిషేకించిన భక్తులు - వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు - పలువురికి బహుమతుల అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం నగరేశ్వర దేవాలయంలో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకా పరమేశ్వరీ మాత వైభోగం వెల్లివిరిసింది. శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. దేవాలయంలో సంఘం మహిళలు, భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. అదేవిధంగా అమ్మవారికి మల్లేపూలతో అభిషేకం చేశారు. అమ్మవారి కీర్తనలు, భజనల పాటలతో పాటు జై వాసవీ.. జైజై వాసవీ మాత నామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య హాజరై అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అదేవిధంగా వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శ్రావణ మహలక్ష్మీ పేరుతో గుడుపల్లి సునీత, సంగీతలకు బహమతులు వరించాయి. అదేవిధంగా పెద్ద ముతైదువ పేరుతో మంతటి శంకరమ్మకు బహుమతి వచ్చింది. సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్, సభ్యుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు గుబ్బ ప్రగతి. సరిత. కవి, శోభ, దీప, శశిరేఖ, కల్వ అర్చన, లగిశెట్టి సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28505/