schedule Friday, September 11, 2026

గోపాల.. గోపాల..!

calendar_today August 26, 2024
person dharshininews
గోపాల.. గోపాల..!
గోపాల.. గోపాల..! - ఎస్‌కేటీఎస్‌లో ఘనంగా గోకులాష్టమి - అలరించిన శ్రీ కృష్ణ, గొల్ల భామలు - ఆట పాటలతో ఉత్సహాంగా సంబరాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆ బాల గోపాలంగా తాండూరు పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. సోమవారం గోకులాష్టమి సందర్భంగా స్కూల్ విద్యార్థులు చిన్ని కృష్ణులతో పాటు గోపికలుగా సందడి చేశారు. శ్రీకృష్ణ పరమాత్మునికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలు ప్రారంభించారు. కృష్ణాష్టమి సందర్భంగా చిన్నారులు నల్లన్నయ్యలుగా.. యశోధ.. గోపికలుగా అలంకరించారు. శ్రీకృష్ణులు, గోపికల ఆట పాటలతో శ్రీకృష్ణాష్ఠమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, కరస్పాండెంట్ సర్వోత్తమ్ రెడ్డి, డైరెక్టర్ ద్యావరి జయవర్దన్ రెడ్డిలు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు పండగలు, సంస్కృతి సంప్రదాయాల విలువలపై అవగాహన పెంచుతున్నామన్నారు. శ్రీ కృష్ణుడు కలియుగంలో అందరి ఆదర్శ ఇష్ట దైవంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రమేష్, సీనీయర్ ఉపాధ్యాయులు పి. చంద్రశేఖర్రెడ్డి, అనిల్ కుమార్, సునీత, టీచర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28560/