schedule Tuesday, July 07, 2026

వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

calendar_today August 26, 2024
person dharshininews
వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు - కన్నుల పండువగా ఉట్టికొట్టే కార్యక్రమం - శ్రీ సాయిమేధాలో సంబరాలు  తాండూరు, దర్శిని ప్రతినిధి: నల్లని వాడు...అల్లరి వాడు గోపికలోలుడు... యశోద తనయుడు...దేవకీ వసుదేవసుతుడు శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు తాండూరు పట్టణం శ్రీ సాయి మేధ విద్యాలయంలో సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. విద్యార్థులు శ్రీకృష్ణ, గోపికల వేషాధారణతో కోలాటం, యోగ్ షాప్, పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉట్టికొట్టే కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. శ్రీకృష్ణుని వేషాధారణలో ఉన్న చిన్నారులు పోటీపడి పైకి ఎగురుతూ ఉట్టి పగులగొట్టారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు నేటి తరుణంలో పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు నేర్పించడంలో భాగంగా కృష్ణాష్టమి వేడుకలను ఆనవాయితీగా ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వక్తగా విచ్చేసిన సౌమ్య మాట్లాడుతూ విద్యార్థులు భగవద్గీత శ్లోకాలు నిత్యం పాటించాలని సూచించారు. ఆంగ్ల మాధ్యమంలో చదివిన మన భారతీయ సంస్కృతిని మరువకూడదన్నారు. సమసమాజ నిర్మాణానికి శ్రీ సాయి మేధ పాఠశాలలో చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సజిత, వైస్ ప్రిన్సిపాల్ నవీన్ కుమార్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు. [video width="848" height="478" mp4="https://www.dharshininews.com/wp-content/uploads/2024/08/VID-20240826-WA0757.mp4"][/video]   ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28570/