schedule Friday, September 11, 2026

ఆనందం పంచిన గోపాలకృష్ణుడు

calendar_today August 26, 2024
person dharshininews
ఆనందం పంచిన గోపాలకృష్ణుడు
ఆనందం పంచిన గోపాలకృష్ణుడు - అక్షర కాన్సెప్ట్‌లో కృష్ణాష్టమి వేడుకలు - ఆకట్టుకున్న ఆట పాటలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం అక్షర కాన్సెఫ్ట్ స్కూల్‌లో గోపాల కృష్ణుడి జన్మదిన వేడుకలు ఆనందంగా జరుపుకున్నారు. సోమవారం స్కూల్లో శ్రీకృష్ణాష్టమి సంబరాలను ఉత్సహాంగా జరుపుకున్నారు. జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణునికి భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని విద్యార్థులు శ్రీకృష్ణ, గోపికల వేషాధారణతో అందంగా తయారై వచ్చారు. శ్రీకృష్ణుడుతో యశోధ, రాధా, గోపికలతో పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉట్టికొట్టే కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమానికి యాలాల మండలం అగ్గనూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు శెట్టి విజయ్ కుమార్, జుంటుపల్లికి చెందిన వరధరాజ్ పంతులు హాజరై యజమాన్యంను, విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మురళీకృష్ణ గౌడ్, డైరెక్టర్లు ఎండీ యూనుస్, ప్రవీణ్‌ కుమార్, శ్రీకాంత్, రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, జయ, అమృత, శ్రీనివాస్, రవి, విజయ్, అనూష, ముస్కాన్, అమ్రయ్య, తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28573/