schedule Thursday, September 03, 2026

మళ్లీ ప్రజా పాలన..!

calendar_today August 27, 2024
person dharshininews
మళ్లీ ప్రజా పాలన..!
మళ్లీ ప్రజా పాలన..! - వచ్చేనెలలో 10 రోజుల పాటు కార్యక్రమం - రేషన్, హెల్త్‌ కార్డులపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ సర్కారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామిలను నెరవేర్చేందుకు చేపట్టిన ప్రజా పాలన రెండో విడత కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్దమైంది.గత డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు మొదటి సారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండో విడతలో కూడా ఆరుగ్యారంటీల కోసం వచ్చేనెల సెప్టెంబర్‌ 17 నుంచి 10 రోజుల పాటు రెండో విడత ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్‌కార్డులు, హెల్త్‌ కార్డుల కోసం వివరాలు సేకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పూర్తి హెల్త్‌ ప్రొఫైల్‌తో రాష్ట్రంలో ప్రజలందరికీ హెల్త్‌కార్డులు జారీ చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28590/