schedule Tuesday, July 07, 2026

రోడ్డేస్తే ఆరు వార్డులకు ఉపయోగం..!

calendar_today August 27, 2024
person dharshininews
రోడ్డేస్తే ఆరు వార్డులకు ఉపయోగం..!
రోడ్డేస్తే ఆరు వార్డులకు ఉపయోగం..! - బతుకమ్మ ఘాట్‌ ఏర్పాటు చేయించండి - ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కౌన్సిలర్ సాహు శ్రీలత వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఒక రోడ్డు వేస్తే ఆరు వార్డుల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని, వెంటనే రోడ్డు వేయించేలా చూడాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి మున్సిపల్ పరిధి 24వ వార్డు కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి మల్ రెడ్డి పల్లి మార్గంలో వెళ్లే రోడ్డుపై వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారని ఎమ్మెల్యేకు వివరించారు. మల్ రెడ్డిపల్లిలోని 2 వార్డు ప్రజలు, 25వ వార్డు, ఇందిరానగర్‌లోని వార్డుల ప్రజలు వినియోగిస్తున్నారని వివరించారు. గత కొన్ని నెలలుగా రోడ్డు ఆధ్వాన్నంగా తయారైందని, ఈ రోడ్డు వేస్తే దాదాపు 6వార్డుల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని కోరారు. అదేవిధంగా ప్రతి యేడాది మల్ రెడ్డిపల్లి చెరువులో దసరా, బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. చెరువులో బతుకమ్మ నిమజ్జనంకు సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కావున మల్ రెడ్డిపల్లి చెరువులో బతుకమ్మ ఘాట్ ఏర్పాటు చేయించేలా చూడాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు కౌన్సిలర్ సాహు శ్రీలత తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళ నేతలు, మహిళలు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28596/