schedule Tuesday, July 07, 2026

గొల్ల చెరువు కబ్జా..!

calendar_today August 30, 2024
person dharshininews
గొల్ల చెరువు కబ్జా..!
గొల్ల చెరువు కబ్జా..! - సర్వేలో తేల్చిన ఇరిగేషన్ అధాకారులు - ఎంత వరకు ఆక్రమణలు జరిగాయంటే..? తాండూరు, దర్శిని ప్రతినిది : తాండూరు పట్టణంలోని ఏకైక జలాశయం గొల్ల చెరువును ఓ వైపు అభివృద్ది చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే కబ్జాలో చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని స్వయంగా ఇరిగేషన్‌ అధికారులే తేల్చారు. గొల్లచెరువులోకి మురుగు నీరు రాకుండా చేసేందుకు ప్రత్యేకంగా కాలువ నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవలే నిధులను మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న శిఖంలోకి మురుగు నీరు రాకుండా చుట్టూరా కాలువను నిర్మించి దిగువన ఉన్న కాగ్నానదిలోకి పంపించేందుకు నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో అధికారులు పట్టణంలోని గొల్ల చెరువు పరిధిపై ఇరిగేషన్ అధికారులు శాటిలైట్ సర్వే నిర్వహించారు. వీటి ఆధారంగా కాలువను నిర్మించేందుకు ఇంజినీర్లు సర్వే చేశారు. అయితే ఈ సర్వేలో చెరువు శిఖం భూమిలోని పది ఎకరాలు పూర్తిగా కబ్జాకు గురైందని గుర్తించారు. ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలోకి వచ్చే శిఖం భూములు ఆక్రమణలకు గురై వర్షాలకు నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని గుర్తించారు. మరోవైపు గొల్ల చెరువులోని ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌ పరిధిలోని ఇళ్ల జోలికి వెళ్లదలచు కోలేదని అధికారులు తెలిపారు. తాండూరులోని గొల్ల చెరువు కబ్జాకు గురైనట్లు తేలడంతో ఎలాంటి చర్యలు చేపడుతారో అని చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే కబ్జాకు గురైన స్థలాలను కొందరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని బీజేపీ నేతలు అధికారులకు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28622/