schedule Friday, September 11, 2026

తాండూరు హిందూ ఉత్సవ కమిటి ఎన్నిక

calendar_today August 30, 2024
person dharshininews
తాండూరు హిందూ ఉత్సవ కమిటి ఎన్నిక
తాండూరు హిందూ ఉత్సవ కమిటి ఎన్నిక - అధ్యక్షురాలుగా స్వప్న పరిమళ్. గౌరవాధ్యక్షులుగా రాజుగౌడ్ - సమితి ప్రధాన కార్యదర్శిగా నాలుగోసారి పట్లోళ్ల నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు హిందూ ఉత్సవ సమితి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రతి యేడాది వినాయక చవితికి ముందు హిందూ ఉత్సవ సమితి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే ఆనవాయితిని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సమితి గౌరవాధ్యక్షులుగా వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, అధ్యక్షురాలుగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ప్రధాన కార్యదర్శిగా నాలుగోసారి మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కోశాధికారిగా తర్లపల్లి భానుకుమార్, ఉపాధ్యక్షులుగా రొంపల్లి సంతోష్ కుమార్, మనపురం రాము, బిర్కడ్ రఘు, అల్లాపూల్ శ్రీకాంత్, అంతారం కిరణ్, చెన్మిళ్ల రాకేష్, అశిష్ అష్టికర్, ఎస్.శ్రీకాంత్ రెడ్డి, సహ కార్యదర్శులుగా సంజయ్ దేశ్ ముఖ్, గాజుల వీరప్రసాద్, జుంటుపల్లి వెంకట్, కోటం ప్రసాద్, సందీప్ రెడ్డి, రజక నర్సింహా, సురేష్ నాయక్, రాజేందర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పరమటి వెంకటేశం(మిర్చి), పర్యాద రామకృష్ణ, వడ్డె పరమేష్, కల్బరల్ సెక్రటరీలుగా మంతన్ గౌడ్ అశోక్, దావులయ్య, ప్రచార కార్యదర్శులుగా తాండ్ర నరేష్, అనిల్ గౌడ్, మీడియా ప్రతినిధులుగా నరేష్ వాల్మీకీ, కుఆర్ వాల్మీకీ, లీగల్ అడ్వయిజర్లుగా పాశం రవికుమార్, పంజుగుల గుండప్ప, ఆధ్యాత్మిక సల హాదారులుగా మడపతి సిద్దిలింగయ్య స్వామిలను ఎన్నుకున్నారు. వీరితో పాటు ముఖ్య సలహదారుల కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28636/