కిడ్నాప్ పెంచిన ప్రేమ..!
August 30, 2024
dharshininews
కిడ్నాప్ పెంచిన ప్రేమ..!
- ఎత్తుకెళ్లిన వాడితో పెరిగిన మమకారం
- కిడ్నాపర్‌ను వీడలేనంటూ బాలుడి కన్నీళ్లు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన వింత ప్రేమ
- చూస్తే మీకు కన్నీళ్లు రావడం ఖాయం
దర్శిని డెస్క్ : తమకు సంబంధంలేని పిల్లలను పెంచుకుని.. చివరికి సొంతమైన వారికి వారిని అప్పగించే సమయంలో పెంచిన వాళ్లు.. విడిపోయే వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనలు సినిమాల్లో చూస్తుంటాం. అలాంటి సంఘటన నిజ జీవీతంలో జరిగితే.. మన కళ్లముందే కనిపిస్తే మన కళ్లు కూడా చెమర్చడం ఖాయం. ఇలాంటి నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నప్పడే బాలున్ని ఎత్తుకెళ్లిన కిడ్నాపర్‌ను వీడలేక ఆ బాలుడు, తల్లిదండ్రులకు అప్పగించే క్రమంలో కిడ్నాపర్ ఇద్దరు కన్నీళ్లు పెట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని జైపూర్‌లోని సంగనేర్ సదర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జూన్ 14, 2023న, బాలుడు అపహరణ గురించిన సమాచారం పోలీసులకు అందింది. అప్పటికి ఆ చిన్నారి బాలుడి వయసు 11 నెలలు మాత్రమే. నిందితుడిని తనూజ్ చాహర్‌గా గుర్తించారు. యూపీ పోలీస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తనూజ్ బాలుడి కిడ్నప్ విషయంపై సస్పెన్షన్‌కు గురయ్యాడు. పాలు తాగే వయసులో ఆ బిడ్డను కన్న తల్లికి దూరం చేశాడు. ఎవరికీ దొరక్కుండా తనతో పాటు ఊరూరూ తిప్పాడు. 14 నెలల తర్వాత ఎట్టకేలకే పోలీసులకు చిక్కాడు. కానీ ఆ బిడ్డకేం తెలుసు.. తనను తల్లిదండ్రులకు దూరం చేసింది ఇతడేనని. ఇన్నాళ్లు తనని సాకినందుకు ఆ కిడ్నాపర్‌పైనే మమకారం పెంచుకున్నాడు.
మరోవైపు తనూజ్ పోలీసుగా పనిచేసిన అనుభవంతో ఫోన్ వాడకుండా.. ఎవరికీ దొరక్కుండా వేర్వేరే ప్రదేశాలు బిడ్డను తిప్పాడు. ఎవరూ తనను గుర్తు పట్టకుండా ఉండేందుకు గడ్డం పెంచుతూ ఎప్పటికప్పుడు వేషం మార్చేవాడు. బిడ్డ కోసం గాలిస్తున్న పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఇటీవల అతడిని అలీఘర్‌లో అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకొచ్చారు.
వీడియో లింక్‌లో చూడండి..
https://twitter.com/iamrehanu/status/1829453898450645164?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1829453898450645164%7Ctwgr%5E0fc89f0e81e9ef0bd1dba98b47654cb7dc6bf607%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-14149621643927363953.ampproject.net%2F2406131415000%2Fframe.html
కిడ్నప్ అయిన బాలుడు దొరికిన సమాచారం అందిన చిన్నారి తల్లిదండ్రులు అతడిని తీసుకెళ్లేందుకు పోలీస్ స్టేషన్‌కు రాగా.. కిడ్నాపర్ తనూజ్‌ను కౌగిలించుకుని ఏడ్చాడు. తల్లిదండ్రుల వద్దకు వెళ్ళడానికి నిరాకరించాడు. కిడ్నాపర్‌ను వీడలేక గుక్కపెట్టి ఏడ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/28643/