schedule Tuesday, July 07, 2026

ఒకటికి వంద ఇస్తా..!

calendar_today September 2, 2024
person dharshininews
ఒకటికి వంద ఇస్తా..!
ఒకటికి వంద ఇస్తా..! - దమ్ముంటే కబ్జా అని నిరూపించండి - ఆక్రమణ ఆరోపణలపై హాది ఓపెన్ చాలెంజ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఒక్క గజం కబ్జా అని నిరూపిస్తే తన సొంత స్థలం నుంచి వంద గజాలు వదిలేస్తా అని తాండూరు ఎంఐఎం పార్టీ అధ్యక్షులు హాది షహేరీ సంచలన సవాల్ విసిరారు. భారీ వర్షాలతో చిలుకవాగు వరధ నేపథ్యంలో తనపై ప్రతిపక్ష పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై సోమవారం మీడియా ముందు హాది ఆక్రోశం వెలగగ్గారు. వర్షాకాలం వరధ వస్తే చాలు హాది ఒక్కరే కనిపిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమ ఆరోపణలు చేయడం అంత ఈజీగా మారిందని విమర్శించారు. ఆరోపణలు చేసిన ప్రతిపక్ష పార్టీల నేతలకు దమ్ముంటే వాటిని నిరూపించాలన్నారు. ఒక్క గజం కబ్జా చేసినట్లు నిరూపిస్తే 100 గజాలు వదిలేస్తానని, 2 గజాలు చేస్తే 200 గజాలు వదిలేస్తానని, అంతకు మించితే.. తాండూరు ప్రజలు విధించే ఏ ఆజ్ఞకైనా తాను సిద్దమే నంటూ సంచలన సవాల్ చేశారు. తాండూరు అభివృద్ధికి తాను సహాకారం అందించేందుకు ఎల్లప్పుడు ముందుంటానని అన్నారు. కావాలనే కొందరు నేతలు తనపై మోసపూరితంగా, కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. చిలక వాగు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కి సహకరిస్తానని పేర్కొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28700/