schedule Tuesday, July 07, 2026

బస్సు సర్వీసులు బంద్‌

calendar_today September 3, 2024
person dharshininews
బస్సు సర్వీసులు బంద్‌
బస్సు సర్వీసులు బంద్‌ - పలు రూట్లలో తాత్కాళికంగా నిలివేత - వెల్లడించిన డీఎం సురేష్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్టీసీ డీపో నుంచి వివిధ రూట్లలో బస్సు సర్వీసులు బంద్ అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో రవాణా సేవలను తాత్కాళికంగా నిలిపివేసినట్లు డీఎం సురేష్‌ కుమార్ వెల్లడించారు. తాండూరు - మహాబూబ్ నగర్ మార్గంలో రోడ్లు తెగిపోవడంతో తాండూరు - శ్రీశైలం, తాండూరు - మహబూబ్ నగర్‌, తాండూరు - సేడం, మార్గాలలో బస్సులను రద్దు చేసినట్లు వివరించారు. హైదరాబాద్‌ మార్గంలో బస్సులు యధావిధిగా నడుస్తాయని తెలిపారు. అదేవిధగంగా చించొల్లి, జహీరాబాద్, సంగారెడ్డి మార్గాలలో బస్సులు నడుస్తాయని చెప్పారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28710/