schedule Friday, September 11, 2026

భజే.. ఆంజనేయం..!

calendar_today September 3, 2024
person dharshininews
భజే.. ఆంజనేయం..!
భజే.. ఆంజనేయం..! - సాయిపూర్‌లో శ్రాణవమాసం ముగింపు - పూజలు నిర్వహించిన ఏఎంసీ చైర్మన్ బాల్ రెడ్డి - భక్తులకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ లోని హానుమాన్ దేవాలయంలో భజే ఆంజనేయ స్వామి నామం మార్మోగింది. మంగళవారం దేవాలయంలో శ్రావణ మాసం ముగింపు ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ పట్లోళ్ల బాల్ రెడ్డి, కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డిలు సతీ సమేతంగా ఆంజనేయ స్వామికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం ముగింపును పురస్కరించుకుని సాయిపూర్ భక్తులు హానుమాన్ దె వాలయానికి పోటెత్తారు. ఆలయంలో స్వామిని దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ బాల్ రెడ్డి, కాలనీ పెద్దలు కలిసి భక్తులకు అన్నదానం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28722/