schedule Tuesday, July 07, 2026

మట్టి గణపతే మహా గణపతి..!

calendar_today September 6, 2024
person dharshininews
మట్టి గణపతే మహా గణపతి..!
మట్టి గణపతే మహా గణపతి..! - మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ - భక్తలకు ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : మట్టి గణపతే మహా గణపతి అని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శుక్రవారం తాండూరు ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ నిర్వహించారు. పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరై మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, ఆయా సంఘాల నాయకులతో కలిసి భక్తులకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ వినాయక చవితికి అందరు మట్టి వినాయకులను ప్రతిష్టించాలన్నారు. మట్టి వినాయకులే మానవాళికి ఎంతో శ్రేష్ఠమని అన్నారు. మట్టి గణపతే మహా గణపతి అని అన్నారు. మట్టి వినాయకుని పూజించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, సాహు శ్రీలత, ఆర్యవైశ్య సంఘం సభ్యులు అలంపల్లి శ్రీనివాస్, కోడూరు వినోద్, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు తర్లపల్లి భాను కుమార్, కార్యదర్శి పునీత్, సభ్యులు కోట్రిక శ్రీకాంత్, వాసవీ మహిళ సంఘం అధ్యక్షరాలు కోట్రిక నాగలక్ష్మి శ్రీకాంత్, మంకాల స్వప్న రాఘవేందర్, ఆయా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28760/