schedule Tuesday, July 07, 2026

రేపు తాండూరులో పవర్ కట్..!

calendar_today September 7, 2024
person dharshininews
రేపు తాండూరులో పవర్ కట్..!
రేపు తాండూరులో పవర్ కట్..! - ప్రకటించిన విద్యుత్ శాఖ అధికారులు - విద్యుత్ ఉండని ప్రాంతాలు ఏవి అంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో పవర్ కట్ విధిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని వెల్లడించారు. తాండూరు మండలం గౌతాపూర్, కోటబాస్పల్లి, కరణ్ కోట్, బషీరాబాద్ మండలం, పెద్దేముల్ మండలం, కోట్ పల్లి మండలంలోని విద్యుత్ ఉప కేంద్రాల పరిధిలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని డీఈ భాను ప్రసాద్ తెలిపారు. 220 కేవీ, 132 కేవీ, 33 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలలో మరమ్మత్తుల దృష్ట్యా విద్యుత్ అంతరాయం ఉంటుందని, కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28805/