schedule Friday, September 11, 2026

గణేష్ మహరాజ్ కీ.. జై..!

calendar_today September 7, 2024
person dharshininews
గణేష్ మహరాజ్ కీ.. జై..!
గణేష్ మహరాజ్ కీ.. జై..! - మండపాల్లో కొలువుదీరిన వినాయకులు - ఇంటింటా గణనాథులకు పూజలు - తాండూరులో వైభవంగా వినాయక చవితి - దర్శించుకున్న ప్రజాప్రతినిధులు, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : గణేష్ మహరాజ్ కీ జై అనే నినాదాలతో తాండూరు మార్మోగింది. శనివారం వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. పట్టణంలో వివిధ కాలనిల్లో, వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో మహాగణపయ్య కొలువుదీరాడు. మండపాల నిర్వహకులు, వినాయక ఉత్సవ సమితి సభ్యులు వేద పండితుల మంత్రోచ్చరణల మద్య ఏకదంత వినాయకునికి పూజలు నిర్వహించారు. అనంతరం వినాయకునికి ప్రీతీపాత్రమైన ఉండ్రాళ్లను. పిండి వంటలను నైవేద్యంగా సమర్పించుకున్నారు. గణనాథులను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. సంవత్సరానికి ఒక సారి ప్రతిష్టించే గణనాథులను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటింట పూజలందుకున్న గణనాథుడు వినాయక చవితి సందర్భంగా పట్టణ వాసులు ఇంటింట గణనాథుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. భక్తుల నివాసాలలో తొలిపూజల అధినాయకుడు వినాయకునికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. సంవత్సరం పాటు ఏ కష్టాలు దరిచేరకుండా కాపాడయ్యా.. ఉండ్రాలయ్యా.. అంటూ వేడుకున్నారు. భక్తి శ్రద్ధలతో వినాయక ఉత్సవాల్లో ఇంటిల్లిపాది నిమగ్నమయ్యారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28809/