schedule Tuesday, July 07, 2026

దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..!

calendar_today September 7, 2024
person dharshininews
దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..!
దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..! - పల్లె పల్లెల్లో వినాయక శోభ - మండలంలో ఘనంగా చవితి - కొలువు దీరిన గణనాథులకు పూజలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. అంటూ తాండూరు మండలంలోని భక్తులు గణానాథున్ని భక్తిశ్రద్దలతో కొలిచారు. శనివారం వినాయక చవితి సందర్భంగా మండలంలోని అంతారం, దస్తగిరి పేట్, గౌతపూర్, చెంగోల్, జినుగుర్తి, బెల్కటూర్, కరణ్ కోట్, మల్కాపూర్ కోటబాస్పల్లి, కొత్లాపూర్, సంగంకలాన్, బిజ్వారం, చెన్‌గెష్‌పూర్, కోనాపూర్, గోనూర్, అంతరం తాండ, పర్వతాపూర్, చింతామణి పట్నం, అల్లాపూర్, సిరిగిరిపేట్, ఉద్దండాపూర్, సంకిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో వినాయక చవితిని అంగరంగా వైభవంగా జరుపుకున్నారు. ఉత్సవ సమితి సభ్యులు రెండు రోజులుగా శ్రమించి అందంగా డెకరేషన్ చేసిన మండపాల్లో గణనాథులను ప్రతిష్టించారు. వేధపండితుల మంత్రాల మద్య వినాయకులను ప్రతిష్టించి పూజించారు. పూజల తరువాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. మొదటి రోజు నుంచే ఆయా మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. పూజలు, అన్నదాన కార్యక్రమాలతో ప్రతి గ్రామంలో వినాయక చవితి శోభ సంతరించుకుంది. పలు గ్రామాల్లో రాత్రి వేళ భజన కార్యక్రమాలతో ఆధ్యాత్మికను చాటుకున్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు పాల్గొని వినాయకులను దర్శించుకున్నారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/28815/