schedule Saturday, July 04, 2026

వాయుగుండం ఎఫెక్ట్..!

calendar_today September 8, 2024
person dharshininews
వాయుగుండం ఎఫెక్ట్..!
వాయుగుండం ఎఫెక్ట్..! - మళ్లీ భారీ వర్షాల సూచన - వెదర్ రిపోర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరంలోని బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత వేగంగా బలపడుతోంది. ఇది తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా రిపోర్టును ప్రకటించింది. ప్రధానంగా.. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ అయింది. ఈ నాలుగు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్‌‌ అలెర్ట్‌.. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ కొనసాగుతోంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలోని జిల్లాలకు సూచన తెలంగాణలో కూడా మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయిని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, గద్వాల, కొమురంభీం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్‌ జిల్లాకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, యాదాద్రి, వికారాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దాంతో.. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్డ్ జారీ చేసింది. భారీ వర్షాల కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28363/