schedule Sunday, September 13, 2026

మనోహర్ రెడ్డి గొప్ప మనసు..!

calendar_today September 9, 2024
person dharshininews
మనోహర్ రెడ్డి గొప్ప మనసు..!
మనోహర్ రెడ్డి గొప్ప మనసు..! - హిందు ఉత్సవ సమితికి భారీ విరాళం - రూ. 3 లక్షల 51 వేలు అందసిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ సమితికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భారీ విరాళం అందజేశారు. సోమవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిశారు. వినాయక చవితి సందర్భంగా హిందూ ఉత్సవ సమితిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తనవంతుగా రూ. 3లక్షల 51 వేల నగదును మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పండగను, నిమజ్జన ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రతిష్టించిన వినాయకునికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, రాము, సమితి ఉపాద్యక్షులు బిడ్కర్ రఘు, సభ్యులు అశోక్, తాండ్ర నరేష్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28884/