schedule Saturday, July 04, 2026

సీపీజీఈటీ ఎంట్రెన్స్‌లో సింధూ క‌ళాశాల ప్ర‌భంజ‌నం

calendar_today October 22, 2021
person dharshininews
సీపీజీఈటీ ఎంట్రెన్స్‌లో సింధూ క‌ళాశాల ప్ర‌భంజ‌నం
సీపీజీఈటీ ఎంట్రెన్స్‌లో సింధూ క‌ళాశాల ప్ర‌భంజ‌నం - ర్యాంకుల‌తో స‌త్తా చాటిన విద్యార్థినిలు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఉస్మానియా యూనివ‌ర్సిటి సీపీజీఈటీ ఎంట్రెన్స్ ప‌రీక్ష‌ల్లో తాండూరు సింధు డిగ్రీ క‌ళాశాల విద్యార్థినిలు ప్ర‌భంజ‌నం సృష్టించారు. గురువారం విడుద‌లైన ఎంట్రెన్స్ ఫ‌లితాల్లో క‌ళాశాల విద్యార్థినిలు ర్యాంకులు సాధించి స‌త్తా చాటారు. ఎంఎస్సీ ఫిజిక్స్‌ విభాగంలో క‌ళాశాల‌కు చెందిన కె.నిఖిత 42వ ర్యాంకు, కె.హ‌రిక 71వ ర్యాంకు, హెచ్. అఖిలాండేశ్వ‌రి 72వ ర్యాంకు, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విభాగంలో నెహారెడ్డి 131వ ర్యాంకు సాధించి మెరిశారు. ఉత్త‌మ ఫ‌లితాల సాధించిన విద్యార్థుల‌ను క‌ళాశాల వ్య‌వ‌స్థాప‌కులు వి.రంగారావు, ప్రిన్సిప‌ల్ విజ‌యాదేవి రంగారావు, ఫిజిక్స్ లెక్చ‌ర‌ర్ ఎన్. సాయికుమార్ గౌడ్, కెమిస్ట్రి లెక్చ‌ర‌ర్ వీర‌ణ్ణ‌, రాజు, అద్యాప‌కులు అభినందించారు.