schedule Saturday, September 05, 2026

శనగలు, బెల్లంలో ఆరోగ్య పోషకాలు..!

calendar_today September 10, 2024
person dharshininews
శనగలు, బెల్లంలో ఆరోగ్య పోషకాలు..!
శనగలు, బెల్లంలో ఆరోగ్య పోషకాలు..! - జ్ఞాపకశక్తిని పెంచే సూపర్ మెడిసిన్‌ - ఏసీడీటీ తగ్గించి జీర్ణశక్తిని బలపరిచే అధిక ప్రోట్రీన్లు దర్శిని డెస్క్ : ఆధునిక జీవనంలో చాలా మంది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. సమస్యలు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే మన ఇంట్లోనే వాటిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అనారోగ్యం తగ్గించి ఆరోగ్య పోషకాలను అందించే శనగలు, బెల్లం ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం. మన శరీరం బలంగా ఉండాలంటే ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్, మినరల్స్ ఉన్న ఆహారం తినడం చాలా ముఖ్యం. బెల్లం, శెనగలు రెండింటితో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శనగల్లో ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం లభిస్తాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజూ ఉదయం శనగలు, బెల్లం కలిపి తింటే కండరాలు దృఢంగా మారుతాయి. వ్యాయాయం చేసే వారు, జిమ్ కు వెళ్లేవారు వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉండడం వల్ల జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలు అధికబరువు , ఊబకాయం. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారికి శనగలు, బెల్లం దివ్యౌషధం లాంటివి. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకుంటే బరువు తగ్గుతారు. ప్రతిరోజూ 100గ్రాముల శనగలను ఆహారంలో తీసుకుంటే శరీరానికి 19 గ్రాముల ప్రొటీన్ అందుతుంది. ప్రస్తుత కాలంలో చాలామంది ఎసిడిటి సమస్యతో భాదపడుతున్నారు. ఎసిడిటి సమస్యను తగ్గించాలంటే బెల్లం, శనగలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి మీ జీర్ణశక్తిని బలంగా ఉంచుతాయి. శనగల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ సూపర్ ఫుడ్ డైజెస్టివ్ ఎంజైమ్‎లను యాక్టివేట్ చేస్తాయి. బెల్లం, శనగలను వీటిని డైట్ లో చేర్చుకుంటే శరీరంలో సెరోటోనిన్ అనే హార్మోన్ ను మెరుగుపరుస్తుంది. దీంతో మీ మెదడు పనితీరు బాగా పెరుగుతుంది. అంతేకాదు ఒత్తిడి కూడా తగ్గుతుంది. తద్వారా జ్ఞాపకశక్తికి పెరుగుతుంది. అదేవిధంగా శనగలు , బెల్లం కలిపి తింటే ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. వీటిలో ఉండే భాస్వరం దంతాలను బలపరుస్తుంది. 10 గ్రాముల బెల్లం 4 మిల్లీగ్రాముల భాస్వరం, 100గ్రాములకు 168 మిల్లీగ్రాముల లభిస్తుంది. గుండె సంబంధిత సమస్యలను నయం చేయడంలో శనగలు, బెల్లం ఎంతగానో సహాయపడతాయి. అధిక రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడతాయి. శనగల్లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28852/