schedule Tuesday, July 07, 2026

ఇదేం వంటగది..!

calendar_today September 10, 2024
person dharshininews
ఇదేం వంటగది..!
ఇదేం వంటగది..! - నీటుగా ఉంచుకోరా - మధ్యాహ్న భోజనంపై సబ్‌ కలెక్టర్ ఫైర్ - కరణ్‌ కోట్ జెడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్ తనిఖీ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇదేం వంటగది ఇట్లాగే ఉంచుకుంటారా.. అంటూ తాండూరు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ మధ్యాహ్న భోజన నిర్వహణపై ఫైర్ అయ్యారు. మంగళవారం తాండూరు మండలం కరణ్‌ కోట్ లోని జెడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్‌ను అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యా బోధనపై ఆరా తీశారు. తరగతి గదుల్లో తిరుగుతూ విద్యార్థులతో ఉపాధ్యాయుల బోధన గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల చేత పలు పాఠ్యాంశాలను చదివించి వారి విద్యా ప్రమాణాలను తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించారు. పాఠశాలలోని వంటగదిని తనిఖీ చేసి అశ్చర్యానికి గురయ్యారు. వంటగదిలో రేషన్ బియ్యం, సరుకులు ఎక్కడికక్కడ ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా లేకపోవడంతో ఉపాధ్యాయులు, నిర్వహకులపై మండిపడ్డారు. రేషన్ బియ్యం అస్తవ్యస్థంగా వదిలేస్తారా.. పురుగులు పట్టవా అని ఫైర్ అయ్యారు. ఇదేం వంటగది.. సాఫ్ నహీ రఖ్‌ తే క్యా అంటూ మండిపడ్డారు. ఇందుకు టీచర్లు గది శుభ్రం చేయించి పరిశుభ్రంగా ఉంచుతామని చెప్పినా కూడా ఇచ్చిన సమాధానంపై సబ్ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సబ్‌ కలెక్టర్ వెంట అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28902/