రొంపల్లి సంతోషా.. మజాకా..!
September 11, 2024
dharshininews
రొంపల్లి సంతోషా.. మజాకా..!
- క్రేజీ రేట్‌కు గణేష్ లడ్డూ సొంతం
- సన్మానించిన చింతామణి గణేష్ ఉత్సవ సమితి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన యువనాయకులు, సామాజిక సేవకుడు డా.రొంపల్లి సంతోష్ కుమార్ గణేష్ ఉత్సవాల్లో క్రేజీ రేటుకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ప్రతి యేడాది గణేష్ ఉత్సవాల్లో ఐదు రోజులు పూజలు అందుకున్న వినాయకుని లడ్డును దక్కించుకుంటున్నారు. ప్రతిసారి వేలంలో పాల్గొని అధిక ధరకు దక్కించుకుంటున్నారు. ఈసారి కూడా బుధవారం పాత తాండూరు చింతామణి గణేష్ ఉత్సవ సమితి ఆద్వర్యంలో జరిగిన లడ్డూ వేలంలో సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ వేలంలో రూ. 2,51,000లకు పాడి లడ్డూను దక్కించుకున్నారు. తాండూరులో రికార్డు సృష్టించిన ధరలలో ఈ ధర కూడా ఒక రికార్డుగా ఉంది.
ఇదికూడా చదవండి..
https://www.dharshininews.com/28949/
ఇదికూడా చదవండి..
https://www.dharshininews.com/28949/