schedule Tuesday, July 07, 2026

గణేష్ లడ్డూకు భలే డిమాండ్

calendar_today September 11, 2024
person dharshininews
గణేష్ లడ్డూకు భలే డిమాండ్
గణేష్ లడ్డూకు భలే డిమాండ్ - రూ. 3లక్షల 61 వేలు పలికిన లడ్డూ - పలు ప్రాంతాల్లో తీవ్ర పోటీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో వినాయకుని లడ్డూకు భలే డిమాండ్ లభించింది. బుధవారం పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలం నిర్వహించారు. ఇందులో రికార్డు ధరకు లడ్డూల వేలం జరిగింది. పట్టణంలోని కన్యాపాఠశాల వద్ద గణేష్ ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని వద్ద లడ్డూ రూ. 3లక్షల 61 వేలు పలికింది. పట్టణానికి చెందిన బంటారం అభిలాష్ అధిక ధరను పాడి లడ్డూను దక్కించుకున్నారు. పట్టణంలోని బాలాజీ మందిర్లో మార్వాడి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని వద్ద పూజలందుకున్న లడ్డూ రికార్డులో స్థాయిలో వేలం పలికింది. మార్వాడీ బజార్ కు చెందిన నందకిషోర్ పర్తాని కుటుంబ సభ్యులు రూ. 1 లక్ష 91 వేలకు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా పట్టణంలోని వినాయక చౌరస్తాలో వినాయక ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని వద్ద లడ్డూను వస్త్రశ్రీ ట్రెండ్స్ వ్యాపారులు పునీత్ కుమార్, విద్యా సాగర్ లు సొంతం చేసుకున్నారు. ఇదికూడా చదవండి...