schedule Tuesday, July 07, 2026

గణేష్ నిమజ్జనంలో పోలీసుల సేవలు భేష్‌..!

calendar_today September 13, 2024
person dharshininews
గణేష్ నిమజ్జనంలో పోలీసుల సేవలు భేష్‌..!
గణేష్ నిమజ్జనంలో పోలీసుల సేవలు భేష్‌..! - మున్సిపల్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ - తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్‌కు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : గణేష్ నిమజ్జన ఉత్సవాలలో తాండూరు పోలీసుల సేవలు అభినందనీయమని మున్సిపల్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్లో సీఐ సంతోష్ కుమార్ ను కౌన్సిలర్ సంగీత ఠాకూర్ గాంధీనగర్ కు చెందిన సిద్ది వినాయక కమిటి సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఐ సంతోష్ కుమార్ ను శాలువాతో సన్మానించి.. డ్రై ఫ్రూట్స్ లడ్డూను బహుకరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జన ఉత్సవంలో పోలీసులు అందించిన సేవలు అభినందనీయమన్నారు. నిమజ్జనంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంతో ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయన్నారు. పోలీసులు తీసుకున్న జాగ్రత్తలు ఫలించాయన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా సహకరించిన పోలీసులకు, అందుకు సహాకారం అందజేసిన ఉత్సవ సమితీల సభ్యులందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు శ్రీకాంత్, శ్రీధర్, భాను ప్రకాష్, నవీన్, గురు, హరీష్, సూర్య ప్రకాష్, సాయి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/29008/