schedule Friday, September 11, 2026

లక్కీ.. విన్నర్స్‌...!

calendar_today September 13, 2024
person dharshininews
లక్కీ.. విన్నర్స్‌...!
లక్కీ.. విన్నర్స్‌...! - గణేష్‌ లక్కీ డ్రాలో బైకులు సొంతం - విజేతలకు అందజేసిన నిర్వహకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : గణేష్‌ లక్కీ డ్రాలో గెలిచిన విన్నర్లు బైకులు, స్కూటీ సొంతం చేసుకున్నారు. తాండూరు పట్టణం వినాయక చౌరస్తాలో శ్రీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని వద్ద నిర్వహించే లక్కీ డ్రా ఎంతో గుర్తింపు పొందింది. ఇక్కడ నిర్వహించే లక్కీ డ్రాలో విజేతలకు ఖరీదైన బహుమతులు అందించిన విశేషం. గత 45 ఏండ్లుగ లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సారి కూడా లక్కీ డ్రా కోసం మొదటి బహుమతిగా హోండా యూనికాన్, రెండో బహుమతికి గా హోండా యాక్టీవా, మూడో బహుమతిగా హోండా షైన్‌ బైకులను ఉంచారు. బుధవారం జరిగిన నిమజ్జనం సందర్భంగా లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో మొదటి బహుమతి హోండా యూనిక్రాన్‌ను తాండూరు పట్టణం శాంత్ మహల్‌కు చెందిన మహేష్‌ కుమార్, రెండవ బహుమతి హోండా యాక్టివాను తాండూరు పట్టణం శాంతినగర్‌కు చెందిన శ్యామయ్య గౌడ్, మూడో బహుమతి హోండా షైన్‌ను తాండూరుకు చెందిన మరో వ్యక్తికి వరించింది. శుక్రవారం ఉత్సవ సమితి నిర్వహకులు లక్కీ డ్రా విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహకులు మాట్లాడుతూ 45 ఏండ్లుగా లక్కీడ్రాను కుల మతాలకు అతీతంగా, ప్రశాంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందుకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, విజేతలు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29020/