schedule Tuesday, July 07, 2026

అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య అసవరం

calendar_today September 15, 2024
person dharshininews
అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య అసవరం
అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య అసవరం - తైక్వాండోలో అమ్మాయిలు రాణించాలి - మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ - జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి క్రీడాకారులకు సర్టిఫికెట్ల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : నేటి సమాజంలో అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య ఎంతో అవసరమని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. తాండూరు చెందిన తైక్వాండో మాస్టర్ డి.రవి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన అమ్మాయిలు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీలలో సత్తా చాటి బంగారు, వెండి, రజత పతకాలను సాధించారు. ఆదివారం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ సత్తా చాటిన అమ్మాయిలను అభినందించారు. తన నివాసంలో క్రీడాకారులకు పతకాలు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు ఎంతో అవసరమన్నారు. బాలికలు ఆపద సమయాల్లో తమను తాము కాపాడుకునేందుకు ఉపయోగపడతాయన్నారు. త్వైక్వాండోలో అమ్మాయిలు సత్తా చాటడం అభినందనీయమన్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఇంకా సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు యువనాయకులు, క్రీడాకారులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29112/