schedule Tuesday, July 07, 2026

ప్రపంచానికే ఆదర్శనీయుడు విశ్వకర్మభగవాన్

calendar_today September 17, 2024
person dharshininews
ప్రపంచానికే ఆదర్శనీయుడు విశ్వకర్మభగవాన్
ప్రపంచానికే ఆదర్శనీయుడు విశ్వకర్మభగవాన్ - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - ఘనంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : విరాట్ విశ్వకర్మ భగవాన్ ప్రపంచానికే ఆదర్శనీయుడని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం విశ్వకర్మ జయంతి ఉత్సవాలు తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. పెద్దేముల్ మండలం కందనెల్లి సమీపంలోని బ్రహ్మంగారి గుట్టపై విశ్వబ్రాహ్మణ(విశ్వకర్మ) సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ఉత్సవాలలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. మహాయజ్ఞంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్వకర్మ భగవాన్ ప్రంపచానికి ఆదర్శమన్నారు. విశ్వకర్మలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ధారాసింగ్, పెద్దేముల్ మాజీ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, కోట్ పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, నాయకులు మహిపాల్ రెడ్డి, జిల్లా నాయకురాలు శోభరాణి, సీనీయర్ జర్నలిస్టు శ్రీనివాస్ చారి, సంఘం ప్రతినిధులు శ్రీనివాస్ చారి, వినోద్ కుమార్ చారి, రవికుమార్ చారి, బాలకృష్ణ చారి, నరేందర్ చారి తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29158/