schedule Saturday, September 05, 2026

స్నానం చేయట్లేదని భర్తకు విడాకులు

calendar_today September 18, 2024
person dharshininews
స్నానం చేయట్లేదని భర్తకు విడాకులు
స్నానం చేయట్లేదని భర్తకు విడాకులు - పెళ్లైన 40 రోజులకే కోరిన భార్య దర్శిని డెస్క్ : స్నానం చేయడం లేదని ఓ భార్య తన భర్తకు విడాకులు కోరింది. పెళ్లైన 40 రోజులకే ఈ సంఘటన జరగడం ఆశ్చర్యానికి గురిచేసింది. చివరకు ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తికి స్నానం చేయడం అంటే ఎక్కడాలేని బద్ధకం ఉంటుందట. దీంతో అతని భార్య పెళ్లైన 40 రోజులకే విడాకులు కోరింది. భర్త నెలకు 1 లేదా 2 రోజులు మాత్రమే స్నానం చేస్తున్నాడని, శరీరం నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నానని, పెళ్లైనప్పటి నుంచి 6 సార్లు మాత్రమే స్నానం చేశాడని, వారానికోసారి గంగాజలం చల్లుకుంటాడని ఆగ్రాలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించింది. దీంతో ఈ నెల 22న కౌన్సెలింగ్ సెంటర్ కు రావాలని భార్యాభర్తలిద్దరికీ అధికారులు సూచించారు. ఆ తరువాత మహిళ కుటుంబం స్థానిక పోలీస్ స్టేషన్‌లో వరకట్న వేధింపుల ఫిర్యాదును దాఖలు చేసి విడాకులు కోరింది. పోలీసులతో చర్చించిన తర్వాత ఆమె భర్త తన అలవాటును మార్చుకుంటానని ప్రతి రోజూ స్నానం చేయడానికి అంగీకరించినట్లుగా తెలిసింది. కానీ, అతని భార్య అతనితో కలిసి ఉండటానికి ఇష్టపడటం లేదని తెలిసింది. తదుపరి పరిష్కారం కోసం సెప్టెంబరు 22న కౌన్సెలింగ్ కేంద్రానికి తిరిగి రావాలని దంపతులకు సూచించినట్టుగా సమాచారం. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29183/