schedule Monday, September 07, 2026

సరిలేరు.. సంపత్‌ సార్‌ సాటెవ్వరు..!

calendar_today September 21, 2024
person dharshininews
సరిలేరు.. సంపత్‌ సార్‌ సాటెవ్వరు..!
సరిలేరు.. సంపత్‌ సార్‌ సాటెవ్వరు..! - నిండు గర్భిణీ కోసం మరోసారి రక్తదానం - రక్తదానంలో తాండూరులోనే రికార్డు తాండూరు, దర్శిని ప్రతినిధి : సరిలేరు సంత్‌ సార్‌కు సాటెవ్వరు అని మరోసారి నిరూపించుకున్నారు తాండూరుకు చెందిన కాంగ్రెస్ సీనీయర్ నాయకులు, బాలాజీ ఆసుపత్రి, బీవీజీ ఫౌండేషన్ అధినేత డా.సంపత్ కుమార్. నిండు గర్భిణీ కోసం మరోసారి రక్తదానం చేసి రెండు ప్రాణాలను కాపాడి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే... శనివారం బషీరాబాద్ మండలం కంసాన్ పల్లి గ్రామానికి చెందిన విజయ్ కుమార్ భార్య లక్ష్మీ మొదటి కాన్పు కోసం జిల్లా ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు రక్తం అవసరం కావడంతో విషయం తెలుసుకున్న డాక్టర్ సంపత్ కుమార్ జిల్లా ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేశారు. రక్తదానం చేయడంలో డా.సంపత్ కుమార్ రికార్డు సృష్టించారు. నిండు గర్భిణీ కోసం 159వ సారి సంపత్ కుమార్ రక్తదానం చేశారు. రక్తదానం చేసి రెండు ప్రాణాలను కాపాడిన డా. సంపత్ కుమార్కు కుటుంభీకులు ధన్యవాదాలు, నాయకులు అభినందనలు తెలిపారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/29248/