schedule Tuesday, July 07, 2026

మొక్కలు నాటడం అందరి బాధ్యత

calendar_today September 22, 2024
person dharshininews
మొక్కలు నాటడం అందరి బాధ్యత
మొక్కలు నాటడం అందరి బాధ్యత - మున్సిపల్ కౌన్సిలర్ అస్లాం - నాలుగో వార్డులో హరితహారం తాండూరు, దర్శిని ప్రతినిధి : మొక్కలు నాటడం అందరి బాధ్యత అని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ అస్లాం అన్నారు. ఆదివారం పట్టణంలోని 4 వార్డులో హరితహారం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అస్లాం, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం తదితరులు వార్డులో మొక్కలు నాటారు. అనంతరం కౌన్సిలర్ అస్లాం మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కలే ప్రధానం అన్నారు. అందరు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అక్రమ్, వార్డు పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/29270/