schedule Friday, September 11, 2026

రజకులకు ఉపాధ్యాయ సంఘం తోడ్పాటు గర్వకారణం

calendar_today September 22, 2024
person dharshininews
రజకులకు ఉపాధ్యాయ సంఘం తోడ్పాటు గర్వకారణం
రజకులకు ఉపాధ్యాయ సంఘం తోడ్పాటు గర్వకారణం - సంఘం రాష్ట్ర అధ్యక్షులు పంజగారి ఆంజనేయులు - ఘనంగా తాండూరు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం తాండూరు, దర్శిని ప్రతినిధి : రజక సంఘంకు ఉపాధ్యాయుల సంఘాల తోడ్పాటు గర్వకారణమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పంజగారి ఆంజనేయులు అన్నారు. ఆదివారం తాండూరు నియోజకవర్గ రజక ఉద్యోగ ఉపాధ్యాయ కమిటి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. గౌరవాధ్యక్షులుగా సుధాకర్, అధ్యక్షులుగా ఐనెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదరి గా తిమ్మాయిపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఆర్. రమేష్, మహిళల ఉపాధ్యక్షురాలుగా సంధ్యారాణి, కోశాధికారిగా రాములు, కార్యదర్శిగా వెంకట్(పంచాయతీ కార్యదర్శి), మహిళ కార్యదర్శురాలుగా టి. అనురాధ, తాండూరు మండల ఆర్గనైజర్ గా చంద్రయ్య, యాలాల మండల ఆర్గనైజర్ గా శేఖర్ లను ఎన్నుకున్నారు. ఆదివారం కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు పంజగారి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు రాములు, జేఏసీ కన్వినర్ కృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం నేతలు వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ రజకుల అభ్యున్నతికి ఐక్యత కృషి చేయాలన్నారు. రజక సంఘంకు ఉపాధ్యాయ కమిటి తోడ్పాటు గర్వకారణమన్నారు. అదేవిధంగా ఈనెల 26న జరిగే చాకలి ఐలమ్మ జయంతిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు రజక సంఘంకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మోహన్, నియోజకవర్గ మాజీ అధ్యక్షులు నాగప్ప, మాజీ ప్రధాన కార్యదర్శి బందెప్ప, తాండూరు పట్టణ అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి రవి, మాజీ అధ్యక్షులు నర్సింలు, కమిటి సభ్యులు డా.నరేష్, వివిధ మండలాల రజక ఉద్యోగ ఉపాధ్యాయ కమిటి పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/29273/