schedule Friday, September 11, 2026

అంతారం అర్బన్ పార్కుకు మహర్దశ

calendar_today September 24, 2024
person dharshininews
అంతారం అర్బన్ పార్కుకు మహర్దశ
అంతారం అర్బన్ పార్కుకు మహర్దశ - పనుల వేగవంతానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశం - సరిహద్దు భూ సమస్యలపై సమీక్షించిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం గ్రామ శివారులో నిర్మిస్తున్న అర్బన్ పార్కుకు మహర్థశ తీసుకరావాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. పార్కులో చేపట్టబోయే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మంగళవారం తాండూరు అటవీ శాఖ అధికారుతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అర్బన్ పార్కు పనులపై సమీక్షించారు. అర్బన్ పార్కు నమూనా చిత్రాన్ని పరిశీలించారు. పార్కులో ఏర్పాటు చేసే యోగా షెడ్, వాకింగ్ ట్రాక్, చిన్నారుల ప్లేగార్డెన్. వాచ్ టవర్ పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం మైల్వార్, జలాల్ పూర్, నీళ్లపల్లి గ్రామాల శివారులో అటవీ శాఖ సరిహద్దు భూ సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాజేందర్, ఇంచార్జ్ సెక్షన్ ఆఫీసర్ పీర్యానాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29325/