schedule Saturday, September 12, 2026

అందరికి ఆదర్శులు పండిట్ దీన్‌దయాల్

calendar_today September 25, 2024
person dharshininews
అందరికి ఆదర్శులు పండిట్ దీన్‌దయాల్
అందరికి ఆదర్శులు పండిట్ దీన్‌దయాల్ - ఆయన సాధనకు కృషి చేయాలి - జయంతి వేడుకలో బీజేపీ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాజీ అధ్యక్షులు, బీజేపీ సిద్దాంతకర్త పండిత్ దీన్‌దయాల్ అందరికి ఆదర్శమూర్తి అని తాండూరు బీజేపీ నేతలు అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పండిత్ దీన్ దయాల్ జయంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా దీన్‌దయాల్ చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, పట్టణ అధ్యక్షులు నాగారం నర్సింలు, సీనీయర్ నాయకులు గాజుల శాంతుకుమార్ తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పండిత్ దీన్‌దయాల్ ఆర్ఎస్ఎస్ కోసం, బీజేపీ కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. గొప్ప సిద్ధాంత కర్తగా అందరికి ఆదర్శంగా నిలిచారని, ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, జిల్లా ఓబీసీ మోర్చ్ అధ్యక్షులు బొప్పి శ్రీహరి, పట్టణ ఉపాధ్యక్షులు మంతటి రాజు, దోమ కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి అంతారం కిరణ్, జిల్లా ఎస్సీ మోర్చ్ ఉపాధ్యక్షులు శ్రీకాంత్, పట్టణ మైనార్టీ అధ్యక్షులు షాబూద్దీన్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి, బూత్ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29356/