schedule Monday, September 07, 2026

సీఎంఆర్ఎఫ్ పేదలకు అండ

calendar_today October 2, 2024
person dharshininews
సీఎంఆర్ఎఫ్ పేదలకు అండ
సీఎంఆర్ఎఫ్ పేదలకు అండ - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - లబ్దిదారులకు ఎల్వోసీల అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు అండగా నిలుస్తోందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణం చెందిన అఫ్రీన్ బేగం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. అదేవిధంగా పెద్దేముల్ మండలానికి చెందిన పద్మమ్మ కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. వారి చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో బాధితులలో ఆఫ్రీన్ భేగంకు రూ. 2లక్షలు, పద్మమ్మకు రూ. 2లక్షల 50వేలు మంజూరయ్యారు. బుధవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు ఎలీసీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు అండగా నిలుస్తోందని అన్నారు. అనారోగ్యంలో ఉండి ఆర్థిక ఇబ్బందులు ఉంటే వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్ఎఫ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29488/