schedule Tuesday, July 07, 2026

వ్యాపార రంగంలో వృద్ధి చెందాలి

calendar_today October 4, 2024
person dharshininews
వ్యాపార రంగంలో వృద్ధి చెందాలి
వ్యాపార రంగంలో వృద్ధి చెందాలి - ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి - వ్యాపార కేంద్రాన్నిప్రారంభించిన బీఎస్‌ఆర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వ్యాపార రంగంలో వృద్దిని సాధించాలని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. తాండూరు పట్టణానికి చెందిన కృష్ణ(కిట్టు) పట్టణంలోని శివాజీ చౌరస్తాలో నూతనంగా శ్రీ భవాని టైర్స్‌ షోరూంను ఏర్పాటు చేశారు. శుక్రవారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభిరుచి కలిగిన వ్యాపార రంగంలో వృద్ధిని సాధించాలని అన్నారు. స్వయం ఉపాధిలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం శ్రీ భవాని టైర్స్ షోరూం లాభాల బాటలో దూసుకపోవాలని యజమాన్యం, నిర్వహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్‌ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్‌ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29515/