schedule Monday, September 07, 2026

కార్పోరేట్ వైద్యానికి చేయూత

calendar_today October 5, 2024
person dharshininews
కార్పోరేట్ వైద్యానికి చేయూత
కార్పోరేట్ వైద్యానికి చేయూత - సీఎంఆర్ఎఫ్ను సద్వినియోగం చేసుకోవాలి - ఎల్ఎసీలు అందజేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదలకు కార్పోరేట్ స్థాయి వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ ప థకం చేయూత అందిస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు మండలం కరణ్ కోట్ కు చెందిన వెంకటేష్ గౌడ్, పెద్దేముల్ మండలం తట్టెపల్లికి చెందిన మజాబీన్ భేగంలు అనారోగ్యానికి గురయ్యారు. వైద్య సాయం కోసం సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోగా వెంకటేష్ గౌడ్ కు రూ. 2లక్షలు, మజాబీన్ భేగంకు రూ. 1లక్ష మంజూరయ్యాయి. దీంతో శనివారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు ఎల్బీసీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు వరంలాంటిదన్నారు. కార్పోరేట్ ఆసుపత్రిలలో వైద్యం పొందేందుకు చేయూత అందుతుందన్నారు. ఈ పథకాన్ని పేదలు సద్వనియోగం చేసుకొ వాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29528/