schedule Tuesday, July 07, 2026

తాండూరు సబ్‌ కలెక్టర్‌కు గౌరవం..!

calendar_today October 6, 2024
person dharshininews
తాండూరు సబ్‌ కలెక్టర్‌కు గౌరవం..!
తాండూరు సబ్‌ కలెక్టర్‌కు గౌరవం..! - సన్మానించిన బ్రాహ్మణ సమాజం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్‌ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌ను స్థానికులు గౌరవించుకున్నారు. తాండూరుకు చెందిన బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో శనివారం రాత్రి బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సతీమణితో కలిసి హాజరయ్యారు. తాండూరు సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఉమాశంకర్ ప్రసాద్‌ను బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు గురురాజ్ దీక్షిత్ గారు, ప్రధాన కార్యదర్శి గురురాజ్ జోషిల ఆధ్వర్యంలో దంపతులను సన్మానించారు. అనంతరం బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవధ్యక్షులు రాఘవేందర్, కరణం మాణిక్ రావు, దత్తాత్రేయ రావు, బ్రాహ్మణ సమాజ మహిళా సభ్యులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29550/