schedule Saturday, July 04, 2026

ఉపాధి సిబ్బందికి తీపికబురు..!

calendar_today October 6, 2024
person dharshininews
ఉపాధి సిబ్బందికి తీపికబురు..!
ఉపాధి సిబ్బందికి తీపికబురు..! - సిబ్బంది క్రమబద్దీకరణపై సర్కారు ఫోకస్ - బీమా, పరిహారం సాయం పెంపు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామి సిబ్బంది సంక్షేమంపై దృష్టిసారించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామిల మేరకు వారిని ఆదుకునేందుకు నిర్ణయం తీసుకుంది. 18 ఏండ్లుగా ఉన్న డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలోని 3,874 మంది ఉపాధి హామీ సిబ్బంది ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఉపాధి హామిలో గత పదేండ్లుగా పనిచేస్తున్నఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులను స్థిరకాల ఉద్యోగులు(ఎఫ్‌టీఈ)లుగా మార్చాలని వీరు తీర్మానించారు. ప్రభుత్వ వాటాతో రూ.5 లక్షల ప్రమాద బీమా, ప్రమాదవశాత్తు మరణించినవారికి రూ.10 లక్షల పరిహారం, ఆరోగ్య బీమా రూ.4 లక్షలకు పెంపు, రెండేళ్ల సర్వీస్‌ వారికి గ్రాట్యుటీ ఇవ్వాలని నిర్ణయించారు. తెలంగాణలో పనిచేస్తున్న ఉపాధి హామీ సిబ్బందికి పేస్కేలు అమలు చేయాలని, ఇకపై వారికి పేస్కేలు ఇవ్వాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సేవల (ఎస్‌ఆర్‌డీఎస్‌) బోర్డు పాలకమండలి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. శనివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ తీర్మానాలు అన్నీ బడ్జెట్‌తో కూడుకున్న అంశాలు కావడంతో ఆర్థిక శాఖ ఆమోదం అందిన వెంటనే అమల్లోకి వస్తాయని మంత్రి సీతక్క వారికి హామీ ఇచ్చారు. దీంతో ఉపాధి హామీ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29562/