schedule Tuesday, July 07, 2026

సమ్మోహనం.. వాసవీ మాత రూపం..!

calendar_today October 6, 2024
person dharshininews
సమ్మోహనం.. వాసవీ మాత రూపం..!
సమ్మోహనం.. వాసవీ మాత రూపం..! - అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం - నగరేశ్వర దేవాలయంలో శరన్నవరాత్రి శోభ - వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : శరన్నవరాత్రుల సందర్భంగా ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకాపరమేశ్వరి మాత సమ్మోహన రూపాలకు భక్తులు మంత్రముగ్దులవుతున్నారు. తాండూరు పట్టణంలోని నగేశ్వర దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వాసవీ మహిళ సంఘం ఆఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నారు. ఆదివారం నాలుగో రోజు అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. చెడుపై అమ్మవారు సాధించిన విజయాలను ప్రదర్శిస్తూ వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో మహిళలు చేస్తున్న ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ కార్యక్రమంలో వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్, ఉపాధ్యక్షురాలు గుబ్బ ప్రగతి, ప్రధాన కార్యదర్శి మంకాల స్వన్న రాఘవేందర్, ఉప కార్యదర్శి తాళ్లపల్లి కవిత, కోశాధికారి సింగంశెట్టి శోభ, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, వాసవీ మహిళ సంఘం సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29580/