schedule Tuesday, July 07, 2026

లలితా త్రిపుర సుందరీ దేవీగా వాసవీ మాత

calendar_today October 7, 2024
person dharshininews
లలితా త్రిపుర సుందరీ దేవీగా వాసవీ మాత
లలితా త్రిపుర సుందరీ దేవీగా వాసవీ మాత - నగరేశ్వర దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు - భారీగా పాల్గొన్న భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం నగరేశ్వర దేవాలయంలో వెలసిన వాసవీ కన్యకాపరమేశ్వరీ మాత లలితా త్రిపుర సుందరీ దేవీగా దర్శనమిచ్చారు. వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఐదవ రోజు వాసవీ మాతను లలితా త్రిపుర సుందరీ దేవీగా అలంకరణ చేశారు. ప్రత్యేక అలంకరణలో దర్శన మిచ్చిన అమ్మవారికి వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ముందు మహిళ భక్తులు లలిత సహస్ర నామా పారాయణం పఠించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలతో దేవాలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో సందడిగా మారింది. శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ఆకట్టుకున్నారు. శరన్నవరాత్రులు సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, ఆర్యవైశ్య సంఘం నాయకులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్, ఉపాధ్యక్షురాలు గుబ్బ ప్రగతి, ప్రధాన కార్యదర్శి మంకాల స్వప్న రాఘవేందర్, ఉప కార్యదర్శి తాళ్లపల్లి కవిత, కొశాధికారి సింగంశెట్టి శోభ, అనుబంధ సంఘాల నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29597/