schedule Tuesday, July 07, 2026

మహాలక్ష్మీ మాత పాహిమాం..!

calendar_today October 8, 2024
person dharshininews
మహాలక్ష్మీ మాత పాహిమాం..!
మహాలక్ష్మీ మాత పాహిమాం..! - పరవసిస్తున్న నగరేశ్వర దేవాలయం - జోరుగా శరన్నవరాత్రి ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : మహాలక్ష్మీ మాతా పాహీమాం అంటూ ఆర్యవైశ్యులు వారి ఆరాధ్యదైవమైన వాసవీ కన్యకా పరమేశ్వరీ మాతను వేడుకుంటున్నారు. పట్టణంలోని నగేశ్వర దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు జోరుగా కొనసాగుతున్నాయి. వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో అనుబంధాల సంఘాల సహాకారంతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజలతో నగరేశ్వర దేవాలయంలో భక్తులు పరవశించి పోతున్నారు. శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఆరో రోజు వాసవీ మాతను మహాలక్ష్మీ మాతగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళ భక్తులు లలిత సహస్ర నామా పారాయణం, కుంకుమార్చన కార్యక్రమాలు భక్తిశ్రద్దలతో నిర్వహించారు. అదేవిధంగా ఆలయంలో పలు అధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్, ఉపాధ్యక్షురాలు గుబ్బ ప్రగతి, ప్రధాన కార్యదర్శి మంకాల స్వప్న రాఘవేందర్, ఉప కార్యదర్శి తాళ్లపల్లి కవిత, కోశాధికారి సింగంశెట్టి శోభ, వాసవీ మహిళ సంఘం సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29627/