schedule Tuesday, July 07, 2026

శరణు.. శక్తీమాత.. దుర్గమ్మ..!

calendar_today October 12, 2024
person dharshininews
శరణు.. శక్తీమాత.. దుర్గమ్మ..!
శరణు.. శక్తీమాత.. దుర్గమ్మ..! - భూకైలాస్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలు - పూజలు నిర్వహించిన వాసు నాయక్ కుటుంభీకులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : శరణు.. శక్తీమాత.. కాపాడు దుర్గామాత అంటూ భక్తులు అమ్మవారిని ప్రార్థించారు. తాండూరు మండలం అంతారం తాండాలోని భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయంలో వ్యవస్థాపకులు వాసుపవార్ నాయక్ ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. శుక్రవారం రాత్రి దేవాలయం వద్ద ప్రతిష్టించిన అమ్మవారిని వాసునాయక్ దంపతులు ఇందిరా పవార్, శాంతి పవార్, కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. వేదమంత్రాల మద్య అమ్మవారికి పూజలు నిర్వహించారు. గిరిజన మహిళలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తిశ్రద్దలతో అమ్మవారిని పూజించి సల్లంగా దీవించాలని వేడుకున్నారు. అనంతరం వాసుపవార్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సంస్కృతి పోటీలు ఆకట్టుకున్నాయి. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29723/