schedule Friday, September 11, 2026

తాండూరు ఎలా ఉంది..!

calendar_today October 13, 2024
person dharshininews
తాండూరు ఎలా ఉంది..!
తాండూరు ఎలా ఉంది..! - ఆప్యాయంగా పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి - సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎలా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తాండూరు నియోజకవర్గ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డిని అడిగారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కోడంగల్ కు వచ్చిన విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డిని కలిసి విజయ దశమి శుభకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తాండూరు ఎలా ఉందని రాజకీయ పరిస్థితులను శ్రీనివాస్ రెడ్డిని అడిగితెలుసుకున్నారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డితో శ్రీనివాస్ రెడ్డి తాండూరు రాజకీయాలతో పాటు అభివృద్ధి గురించి చర్చించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29736/