సీఎం రేవంత్ రెడ్డి సార్ హ్యాపీ దసరా..!
October 13, 2024
dharshininews
సీఎం రేవంత్ రెడ్డి సార్ హ్యాపీ దసరా..!
- శుభాకాంక్షలు చెప్పిన ఉదయ్ భాస్కర్ రెడ్డి
- ముఖ్యమంత్రిని కలిసిన మార్కెట్ కమిటి డైరెక్టర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి సార్ హ్యాపీ దసరా అంటూ తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి సందర్భంగా ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కోడంగల్‌లో నేతలను కలిసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్ రెడ్డికి చేతిలో చేయి కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉదయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, సోదరుడు శ్రీనివాస్ రెడ్డిల నాయకత్వంలో తాండూరులో ప్రజా పాలన కొనసాగుతుందని అన్నారు. వారి నాయకత్వంతో ముందుకు సాగుతామని అన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/29753/