schedule Tuesday, July 07, 2026

గురుకులంలో ఖాళీ పోస్టులు..!

calendar_today October 15, 2024
person dharshininews
గురుకులంలో ఖాళీ పోస్టులు..!
గురుకులంలో ఖాళీ పోస్టులు..! - భర్తికి దరఖాస్తుల ఆహ్వానం - గడువు ఎప్పటి వరకు అంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం జినుగుర్తి సమీపంలోని గురుకుల పాఠశాలలో పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ప్రిన్సిపల్ వెంటకమ్మ ఓ ప్రకటన విడుదల చేశారు. పాఠశాలలో పిజిటి, మాథ్స్, జూనియర్ లెక్చరర్ మాథ్స్, జూనియర్ లెక్చరర్ జువాలజీ, టిజిటి ఇంగ్లీష్, టి జి టి సోషల్, పిడి 1, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరడం జరుగుతుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈనెల 21న మానస హిల్స్ రాజేంద్రనగర్లో డెమో ఇంటర్వ్యూ ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు ఆయా సబ్జెక్టుల్లో పీజీ, బీఎడ్ పూర్తి చేసి ఉండాలన్నారు. పూర్తి వివరాలకు సెల్‌: 6304032637 సంప్రదించాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29765/