schedule Saturday, September 12, 2026

బీఆర్ఎస్ పార్టీకి షాక్..!

calendar_today October 15, 2024
person dharshininews
బీఆర్ఎస్ పార్టీకి షాక్..!
బీఆర్ఎస్ పార్టీకి షాక్..! - హస్తంలో చేరిన హాజీపూర్ మాజీ సర్పంచ్ - ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో చేరిక తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజక వర్గంలోని బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. యలాల మండలంకు హాజీపూర్ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నుంచి వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో మాజీ సర్పంచ్ ఒంగోనిబాయి శ్రీనివాస్ కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. ఎమ్మేల్యే మనోహర్ రెడ్డి శ్రీనివాస్ ను పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ సర్పంచుతో పాటు ఆయన అనుచరులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉన్నారు.     ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29769/