schedule Tuesday, July 07, 2026

తాండూరును కమ్మేసిన మంచు..!

calendar_today October 16, 2024
person dharshininews
తాండూరును కమ్మేసిన మంచు..!
తాండూరును కమ్మేసిన మంచు..! - కాసేపటికే కురిసిన వర్షం - పట్టణంలో వింత వాతావరణం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో బుధవారం ఉదయం వింత వాతావరణం చోటు చేసుకుంది. తెల్లవారు జామున తాండూరు పట్టణాన్ని పొగమంచు కమ్మేసుకుంది. దాదాపు గంటకు పైగా మంచు పొగ దుప్పటిలా పరుచుకుంది. దీంతో పలు కాలనీలు మంచుతో నిండుకుపోయాయి. దట్టంగా కురిసిన మంచు వల్ల పట్టణంలోని ప్రధాన రహదారులు కోడంగల్, చించొల్లి రోడ్డు, విలియమూన్ - అంతారం రోడ్డు, హైదరాబాద్ రోడ్డు మార్గం ఇతర ప్రాంతాలు పొగమంచుతో విస్తరించుకున్నాయి. పొగమంచు వల్ల రహదారులపై లారీలు, ఆర్టీసీ బస్సులు, బైకుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. మరోవైపు పొగమంచు విప్పేసిన కాసేపటికే పట్టణంలో జోరు వర్షం కురిసింది. వర్షం వల్ల పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సరిగ్గా పాఠశాలలు, కాలేజీ సమయంలో, ప్రజలకు పనులకు వెల్లే సమయంలో వర్షం కురవడం వల్ల ఇబ్బందులు పడ్డారు. తాండూరులో బుధవారం ఏర్పడిన వింత వాతారణానికి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29804/