schedule Tuesday, July 07, 2026

కొనసాగుతున్న కుక్కల వేట..!

calendar_today October 17, 2024
person dharshininews
కొనసాగుతున్న కుక్కల వేట..!
కొనసాగుతున్న కుక్కల వేట..! - ప్రత్యేక బృందాలతో గాలింపు - పరిశీలించిన కమీషనర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో వీధి కుక్కల వేట కొనసాగుతోంది. గత కొన్ని రోజుల క్రితం వీధి కుక్కల బెడధ అధికం కావడంతో ప్రజలు భయాందోళనకు గురి కావడంతో చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్లు వెలువెత్తిన సంగతి తెలిసిందే. ఇటీవలే మున్సిపల్ ఆధ్వర్యంలో వీధి కుక్కల వేటను ప్రారంభించారు. గతంలో 12 కుక్కలను పట్టుకుని 8 మగ కుక్కలకు నియంత్రణ ఆపరేషన్లు చేశారు. తాజాగా గురువారం కూడా వీధి కుక్కల వేటను ప్రారంభించారు. పట్టణంలోని ఇందిరానగర్‌లో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి వీధి కుక్కలను పట్టుకున్నారు. మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి వీధి కుక్కల వేటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వీధి కుక్కల నుంచి రక్షణ కల్పించడంతో పాటు వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పట్టుకున్న వీధి కుక్కలను డంపింగ్ యార్డుకు తరలించిన అక్కడ ఆపరేషన్లు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29819/