schedule Friday, September 11, 2026

ప్రతి గుడిలో జమ్మి చెట్టు నాటాలి

calendar_today October 18, 2024
person dharshininews
ప్రతి గుడిలో జమ్మి చెట్టు నాటాలి
ప్రతి గుడిలో జమ్మి చెట్టు నాటాలి - మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య - కౌన్సిలర్ సాహు శ్రీలతతో కలిసి మొక్క ఏర్పాటు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి గుడిలో జమ్మి చెట్టును నాటాలని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం24వ వార్డు కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ జన్మదినం పురస్కరించుకుని పట్టణంలోని పాత తాండూరులోని తుల్జాభవాని దేవాలయంలో ఆమెతో కలిసి కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య జమ్మి చెట్టును నాటారు. ఈ సందర్భంగా కోట్రిక విజయలక్ష్మీ మాట్లాడుతూ జమ్మి చెట్టు ఎంతో విశిష్టమైందని అన్నారు. జమ్మి చెట్టు ప్రతి దేవాలయంలో ఉండాలనే ఉద్దేశంతో నాటటం జరిగిందన్నారు. అదేవిధంగా తన జన్మదినం సందర్భంగా జమ్మి చెట్టును నాటడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29841/