schedule Tuesday, July 07, 2026

పట్టణాభివృద్ధికి కృషి..!

calendar_today October 18, 2024
person dharshininews
పట్టణాభివృద్ధికి కృషి..!
పట్టణాభివృద్ధికి కృషి..! - మురుగు అవస్థలు తీర్చడంపై దృష్టి - మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్టీలకతీతంగా పట్టణాన్ని అభివృద్ధి పరచడమే తమ ధ్యేయమని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండా స్వప్న పరిమళ్‌ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని సత్యసాయి బాబా మందిరం సమీపంలో చేపడుతున్న మురుగు కాలువ నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. వార్డుల్లో ప్రజలకు మురుగు కాలువల అవస్థలను తొలగించేందుకు డ్రైనేజీల నిర్మాణంపై దృష్టిసారిస్తున్నామన్నారు. ఏ ప్రాంతంలో మురుగు నీటి ఇబ్బందులు రాకుండా డ్రైనేజీలను నిర్మించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, నాయకుల అందరి సహాకారంతో పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. మున్సిపల్ డీఈ, ఏఈ, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29847/